ఉపరాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడకు బేగంపేట ఎయిర్ పోర్టులో ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం వెంకయ్య ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. వీడ్కోలు కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్ ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. వెంకయ్యనాయుడికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిన్న పౌరసన్మానం జరిగిన విషయం తెలిసిందే.








