ఘనంగా ఉపరాష్ట్రపతికి పౌర సన్మానం
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజ్భవన్లో పౌరసన్మానం ఘనంగా నిర్వహించారు. ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్కు వచ్చిన ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిదులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రాజ్భవన్లో ఆయనకు పౌరసన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు వెంకయ్యనాయుడితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.








