సీఎం కేసీఆర్‌కు ఉపరాష్ట్రపతి ధన్యవాదాలు
తెలంగాణలో తన పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అందించిన స్వాగత మర్యాదలకు, శుభాకాంక్షలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన కేసీఆర్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆతిథ్యం అపూర్వమని కొనియాడారు. పౌరసన్మానం కార్యక్రమంలో చక్కని తెలుగులో కేసీఆర్ చేసిన ప్రసంగం తనను ఆట్టుకుందన్నారు. చక్కని తెలుగు భోజనాన్నీ అందించారని ప్రశంసిస్తూ శూభాభినందనలు తెలిపారు.








