పాత్రికేయ వృత్తిలో నిబద్ధత విలువలే ప్రధానం
పాత్రికేయ వృత్తిలో నిబద్ధత, విలువలే ప్రధానమని అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ బీ హడ్డా అన్నారు. హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పాత్రికేయుల్లో విలువలు-కాలమాన పరిస్థితులు అనే అంశంపై చర్చ జరిగింది. మెరుగైన అధ్యయనం, నైపుణ్యాల ఆధారంగా పాత్రికేయ వృత్తి కొనసాగుతున్నదని ఆమె అన్నారు. సమాజంలోని సంఘటనలు తెలియజేసే పాత్రికేయులు పలువురికి ఆదర్శంగా నిలువాలని హెచ్సీయూ వీసీ పీ అప్పారావు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.













