కెసిఆర్ ఓ అబద్ధాల కోరు
సిఎం కెసిఆర్ ఓ అబద్దాల కోరు, ఒక మాటకు మాట పొంతన ఉండదు, రాత్రి మాట్లాడింది పొద్దున ఉండదు అంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భయంతోనే కెసిఆర్ ప్రేలాపనలకు దిగారన్నారు. లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేష్ పట్ల కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. తెలంగాణ ఆవిర్భావంలోకీలక పాత్రవహించిన మహిళానేత, అప్పటి స్పీకర్ మీరాకుమార్ పట్ల మాట్లాడాల్సిన విధానం ఇదేనా అన్నారు.ప్రజలకు అందుబాటులోలేని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.













