ఉర్దూ వర్సిటీని సందర్శించిన యుఎస్ కౌన్సిల్ జనరల్
గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీని యుఎస్ కౌన్సిల్ జనరల్ క్యాథరీన్ హడ్దా సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులతో వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ అస్లాం పర్వేజ్ ఆమెతో సమావేశమయ్యారు. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థుల అభ్యున్నతి కోసం యుఎస్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని సూచించారు. యూనివర్సిటీలో ఉన్న కోర్సుల వివరాలను అందించడంతో పాటు వర్సిటీ ఎదుర్కొంటున్న సవాళ్లను తెలిపారు. మధర్సాల నుంచి వచ్చే గ్రాడ్యుయేట్ల కోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జీ కోర్సు వివరాలను ఆయన వివరించారు. బ్రిడ్జీ కోర్సులో ఇంగ్లీష్ మాధ్యమంలోనూ విద్యార్థులు కోర్సులు అభ్యసిస్తున్నారని ఆయన తెలిపారు.








