చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి
హైదరాబాద్లోని చార్మినార్ (Charminar) సమీపంలోని భాగ్యలక్ష్మి దేవాలయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (N. Ramchander Rao), కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి (G. Kishan Reddy) తదితర నాయకులు అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ సందర్శన సందర్భంగా పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా అమిత్ షా వెంట ఉన్నారు.







