హైదరాబాద్ మెట్రో రెండో దశకు రూ.275 కోట్లు మంజూరు
హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro Rail) ప్రాజెక్టు రెండో దశ (Second phase) పనుల కోసం కేంద్రం రూ.275 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందులో రూ.125 కోట్లు రుణం రూపంలో ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం (Central Government) పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. రెండో దశ లో రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు విస్తరణకు గతంలో ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే.







