సీఈసీ జ్ఞానేశ్ కుమార్ని ఇండియా కూటమి గద్దె దించగలదా..?
సీఈసీ అంటే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్. ఇది రాజ్యాంగ బద్ధమైన పదవి. ఈపదవి నుంచి కేంద్రం కూడా.. జ్ఞానేశ్ కుమార్ని నేరుగా తొలగించలేదు. దీనికి రాజ్యాంగం సూచించిన విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించే విధానం అవలంభించాలి. అంటే రాజ్యాంగ పరమైన అంశాలను పాటిస్తూ ముందుకెళ్లాలి. ఇంతకు అవేమిటంటే..
CECని తొలగించే రాజ్యాంగ ప్రక్రియ..!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం…లోక్సభలో తొలగింపు తీర్మానం ఆమోదం పొందాలి.
రాజ్యసభలోనూ తీర్మానం ఆమోదం పొందాలి.నిరూపిత దుష్ప్రవర్తన లేదా అసమర్థత వంటి రాజ్యాంగపరమైన కారణాలు ఉండాలి.ప్రతి సభలో మొత్తం సభ్యుల మెజారిటీతో పాటు హాజరై ఓటు వేసిన సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మద్దతు అవసరం.
సంఖ్యాబలం అవసరం..!
సీఈసీని తొలగించాలంటే ముందు విపక్షానికి అవసరమైన సంఖ్యా బలం కావాలి. ప్రస్తుతం విపక్ష ఇండియా కూటమికి ఉన్న బలం.. తీర్మానంప్రవేశపెట్టడానికి సంతకాలకు సరిపోతాయి. కానీ.. CECని నిజంగా తొలగించాలంటే రెండు సభల్లోనూ ప్రత్యేక మెజారిటీ సాధించాలి. అంతేకాదు..విచారణ కమిటీ ఆరోపణలను నిర్ధారించాలి.లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ అవసరమైన మెజారిటీ రావాలి.ఆమోదం ఒకే పార్లమెంటు సమావేశంలో రావాలి.అందువల్ల ప్రతిపక్షానికి ఉన్న ఎంపీల సంఖ్య మాత్రమే కాకుండా, అధికార పక్షం లేదా ఇతర పార్టీల ఎంపీల మద్దతు కూడా కీలకం.
ఇవి కూడా చదవండి
ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని 2026 మార్చిలో ప్రతిపక్ష ఎంపీలు లోక్సభ, రాజ్యసభల్లో నోటీసులు ఇచ్చారు.లోక్సభలో 130 మంది ఎంపీలు సంతకాలు చేశారు.రాజ్యసభలో 63 మంది ఎంపీలు సంతకాలు చేశారు.అయితే ఏప్రిల్ 6న లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ఆ నోటీసులను స్వీకరించలేదు.
ఇండియా కూటమి ముందున్న అవకాశాలు..
ఎన్నికల సంఘం నిర్ణయాలపై పార్లమెంటులో చర్చకు ఒత్తిడి తీసుకు వచ్చే అవకాశం ఉంది.
ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుంచడం..ఎన్నికల సంఘం పనితీరుపై న్యాయపరమైన పరిశీలన కోరడం, ఇదే సమయంలో ఇతర పార్టీల మద్దతు కోరడం చేయవచ్చు.
చట్టపరమైన అడ్డంకులు..!
లోక్సభ మొత్తం సభ్యుల్లో మెజారిటీ సాధించాలి. రాజ్యసభ మొత్తం సభ్యుల్లో మెజారిటీ అదనపు మద్దతు అవసరం..ఆ తరువాత రాష్ట్రపతి తొలగింపు ఉత్తర్వు జారీ చేస్తారు.
CECకు అనుకూలంగా ఉన్న వాదనలు
కేవలం రాజకీయ విభేదాలతో సీఈసీని తొలగించడం సాధ్యం కాదు.ఎన్నికల సంఘం నిర్ణయాలు సంస్థాగత ప్రక్రియలో భాగమని ఎన్నికల సంఘం పేర్కొంది.గత నోటీసుల్లో ఆరోపణలకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు లేవని స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ అభిప్రాయపడ్డారు.
ఇండియా కూటమి CECని తొలగించాలంటే మూడు అడ్డంకులు దాటాలి.తొలగింపు నోటీసు ఆమోదం పొందాలి.ఆరోపణలు విచారణలో నిరూపించబడాలి.పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ రావాలి.CECపై ఆరోపణలు నిరూపితమైతే, అధికార పక్షానికి పార్లమెంటులో మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యాంగపరమైన తొలగింపు ప్రక్రియను ఎదుర్కోవాల్సి ఉంటుంది.







