ఉజ్జయిని బోనాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం
ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో ఈ నెల 9న జరిగే బోనాలు, 10న జరిగే కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ అర్చకులు, నిర్వహణ కమిటీ సభ్యులు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్కు అందించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో వచ్చిన వారు ముఖ్యమంత్రి కేసీఆర్ను ఈ వేడుకకు ఆహ్వానించారు. బోనాల పండుగ నిర్వహణకు నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.








