తెలంగాణలో పసుపు పార్క్
తెలంగాణలో పసుపు రైతుల సమస్యలపై రాష్ట్ర మంత్రులు, ఎంపీలు తనను కలిశారని కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తనను కోరినట్టు తెలిపారు. రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల అభివృద్ధి బోర్డు ఏర్పాటు యోచనలో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. గుంటూరు, కర్ణాటక తరహాలో పసుపు పార్క్ ఏర్పాటు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదని ఇప్పటికే చెప్పామని అన్నారు.








