దండు మల్కాపురంలో పారిశ్రామిక పార్క్
తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో 100 కోట్ల రూపాయల పెట్టుబడితో పర్యావరణహిత పారిశ్రామిక పార్క్‌ను తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టిఎ్‌సఐఐసి) ఏర్పాటు చేయనుంది. తొలుత ప్రభు త్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి)లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పటికీ, కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావటంతో టిఎస్ ఐఐసినే 376 ఎకరాల్లో ఈ పార్క్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే జూలై నెలలో పార్క్‌కు శంకుస్థాపన చేసేందుకు రెడీ అవుతోంది. దాదాపు 900 కోట్ల రూపాయల పెట్టుబడులతో దండు మల్కాపురం పార్కులో సుమారు 400లకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.








