మీ వెయిట్ చెక్ ఇట్ : స్కూల్ బ్యాగ్ బరువులు డిసైడ్ చేసిన KCR సర్కార్
మన ఆంద్రా కెప్పుడో…..
స్కూలు విద్యార్ధులకు పుస్తకాల మోత నుంచి కాస్త రిలీఫ్ నిచ్చింది తెలంగాణ ప్రభుత్వం.బుక్స్ భారం తగ్గించేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. తరగతుల వారీగా పుస్తకాల బ్యాగుల బరువులుండేట్లుగా మార్పులు చేసింది. దీన్ని అన్ని స్కూళ్లు అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. నిర్ధేశించిన బరువు మించి ఎక్కువ పుస్తకాలను మోసేలా చేసే స్కూళ్ల యాజమాన్యాలపై చర్యలు తప్పవని తేల్చిచెప్పింది సర్కారు.
తరగతుల వారీగా పుస్తకాల బరువులు
1,2 తరగతుల విద్యార్థుల బ్యాగు బరువు-1.5 కిలోలు
3,5 తరగతుల విద్యార్ధుల బ్యాగు బరువు- 2 నుంచి 3 కిలోలు
6,7 తగతుల విద్యార్థుల బ్యాగు బరువు- 4 కిలోలు
8,9 తరగతుల విద్యార్థుల బ్యాగు బరువు-4.5 కిలోలు
10వ తరగతి విద్యార్థుల బ్యాగు బరువు- 5 కిలోలు








