తెలంగాణ టూరిజానికి అవార్డుల పంట
తెలంగాణ టూరిజానికి జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన పౌర సేవలను నిర్వహించిన గ్రెటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా అవార్డు దక్కించుకుంది. వరంగల్ వారసత్వ నగరంగా అవార్డు దక్కించుకుంది. రాష్ట్ర పర్యాటక ప్రదేశాలను తెలిపే విధంగా రూపొందించిన చైనీస్ భాషలోని మార్కెటింగ్ ప్రోమోకు, స్వచ్ఛత విభాగంలో పర్యాటక శాఖకు రెండు అవార్డులు లభించగా, దివ్యాంగులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా నిర్వహణ ఏర్పాట్లు చేసినందుకు హైదరాబాద్‌లోని చౌమొహల్లా ప్యాలెస్‌కు, ఉత్తమ కనె్వన్షన్ సెంటర్‌గా హైదరాబాద్‌లోని లియోనియా సెంటర్‌కు, ఉత్తమ మెడికల్ టూరిజం సౌకర్యాల విభాగంలో అపోలో ఆస్పత్రికి అవార్డులు దక్కాయి. అలాగే ఉత్తమ టూరిస్టు గైడ్‌గా తెలంగాణకు చెందిన కె.కాశీరావు అవార్డును అందుకున్నారు.
అవార్డులను పర్యాటక శాఖ కార్యదర్శి వెంకటేశం, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిషనర్ సునీత భగవత్, ఎండి క్రిస్టినా చోంగ్తు, జిఎహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి, వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, వరంగల్ మున్సిపాల్ కమిషనర్ శృతి ఓఝా, వరంగల్ మేయర్ ఎన్ నరేందర్ రాష్టప్రతి రామ్నాద్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ దేశంలో పర్యాటక అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలబడడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం పర్యాటక అభివృద్దిలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ, మొదటి స్థానానికి చేరుకోవడానికి ఎంతోకాలం పట్టదని అన్నారు.








