వర్షాభావంతో రైతాంగం విలవిల
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితితో రైతులు విలవిలలాడుతున్నారు. జూన్లో నైరుతీ రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించినప్పటి నుండి ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో తక్కువ వర్షాపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ (పాతవి) జిల్లాల్లో 20 నుండి 30 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. ఖమ్మం జిల్లాలో సాధారణం కంటే 10 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు సాధారణం కంటే తక్కువగా కురిశాయి. జూన్ రెండోపక్షం నుండి జూలై మొదటి పక్షం వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. చెరువులు, కుంటల్లోకి నీళ్లు వచ్చే వర్షాలు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది.








