దాసరి మృతికి సంతాపం
దర్శకరత్న దాసరి నారాయణరావు మృతికి పలువురు ఏపీ, తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, లోకేశ్, కళా వెంకట్రావు, మాణిక్యాలరావు, పితాని, ప్రతిపాటి, జవహర్, తలసాని శ్రీనవాస్ యాదవ్, నాయిని నర్సింహరెడ్డితో పాటు పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. అలాగే కాపు నేత ముద్రగడ పద్మనాభం, కేవీపీ, రఘువీరారెడ్డి, వంటి వసంతకుమార్, తోట నరసింహం, డీఎస్ సంతాపం తెలిపారు. దాసరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.








