ప్రపంచ సుందరి పోటీలకు తెలంగాణ యువతి ఎంపిక
ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ యువతి ఎంపికైంది. ఖమ్మం జిల్లాకు చెందిన రవి కుమార్ కూతురైన శ్రావ్య ఈ పోటీలకు ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. రవికుమార్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల వ్యవసాయాధికారిగా 2004 నుండి 2006 వరకు విధులు నిర్వహించారు. సుమారు 12 సంవత్సరాల కిందట ఉద్యోగాన్ని వదిలి ఆయన కుటుంబం కెనడా వెళ్లింది. దీంతో శ్రావ్య విద్యాభ్యాసం అక్కడే కొనసాగగా కెనడా దేశం నుండి ప్రపంచ సుందరి పోటీలకు ఎంపికైంది. తమ మండల వ్యవసాయాధికారిగా పనిచేసిన రవికుమార్ కూతురు ప్రపంచ సుందరి పోటీలకు ఎంపిక కావడంపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.













