తెలంగాణ మహానాడుకు సీఎం చంద్రబాబు రాక
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రనాయుడు తెలిపారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ మహానాడుకు రావాలని రాష్ట్ర నేతలు విజయవాడలో కలిసి ఆహ్వానించగా ఆయన అంగీకరించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి చంద్రబాబును కలిసి మహానాడు నిర్వహణ ఏర్పాట్లను వివరించారు.








