పది ఫలితాల్లో జగిత్యాల ఫస్ట్… వనపర్తి లాస్ట్
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలోని డి బ్లాక్లో విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలను 5,33,701 మంది రాసినట్లు కడియం వెల్లడించారు.
ఈ ఫలితాల్లో జగిత్యాల జిల్లా మొదటి స్థానం సంపాధించింది. మొత్తం 97.35 శాతం ఉత్తీర్ణతతో మొదటిస్థానంలో నిలవగా 64.80 శాతం ఉత్తీర్ణతతో వనపర్తి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 2005 పాఠశాలలో 100 శాతం ఫలితాలు వచ్చాయి. అలాగే 28 పాఠశాలల్లో సున్నా ఫలితాలు నమోదు అయ్యాయి. ఇదిలా ఉండగా, గత ఏడాదితో పోలిస్తే 1.47 శాతం ఉత్తీర్ణత తగ్గింది. బాలికల ఉత్తీర్ణత 85.37 శాతం కాగా, బాలురు ఉత్తీర్ణత శాతం 82.95 గా నమోదైంది. ఈ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. అలాగే జూన్ 5 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.








