సమరానికి సై
టీఆర్ఎస్ తీరును ఎండగట్టేందుకు సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌ను సమర్థంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా జిల్లా స్థాయిలో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉంటుందన్న ఆశతో టీఆర్ఎస్లో ఇప్పటిదాకా జరిగిన చేరికలకు ఇక అడ్డుకట్ట పడినట్టేనని బీజేపీ భావిస్తోంది. అధికార పార్టీ పట్ల అధిష్టానం వైఖరిపై అనుమానాలున్న నాయకులు సైతం ఇక సమరానికి సై అంటున్నారు.








