హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ సిటీ వై-ఫై ప్రాజెక్టులో భాగంగా నగరంలోని వెయ్యి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హాట్స్పాట్లను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ బి.రామ్మోహన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెయ్యి హాట్స్పాట్లను క్రమంగా 3 వేలకు పెంచుతామన్నారు.








