రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు: గవర్నర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ నరసింహన్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పూలను అరాధించే పండుగ బతుకమ్మ అని గవర్నర్ అన్నారు. బతుకమ్మ తెలంగాణ సంస్వృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేస్తోందని తెలిపారు. ప్రతి మహిళ ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.








