వార్నింగ్ ఎఫెక్ట్.. కలెక్టర్ ఆమ్రపాలిలో మార్పు..!
సీఎం కేసీఆర్ వార్నింగ్‌తో కలెక్టర్ ఆమ్రపాలి డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది. ఇవాళ జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు పొడువు చేతులు నిండుగా చీర కట్టుతో హాజరై అందరనీ ఆశ్చర్యపరిచారు. ఇందులో ఆశ్చర్యమేముంది.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సహజంగానే చీర కట్టులో వస్తారు కదా.. అని అంటారా..? ఆ విషయంలోకే వద్దాం.. ఎప్పుడూ వెస్ట్రన్ స్టైల్లో కనిపించే కలెక్టర్ ఆమ్రపాలి డ్రెస్సింగ్ స్టైల్‌పై ఇటీవల సీఎం కేసీఆర్ ఆగ్రహించినట్లు వార్తలు వచ్చాయి.
ఇటీవల సీఎం కేసీఆర్ రాష్ట్ర అధికారులు, అధికార ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు డ్రెస్సింగ్ స్టైల్‌పై కొంత అసహనం వ్యక్తం చేశారు.జీన్స్ ఫ్యాంట్లు, టీషర్టులు వేసుకోవడం పట్ల ప్రజల్లో అధికారులంటే గౌరవం పోతోందని కొత్త సిద్ధాంతం తెచ్చారు. మంత్రులు, అధికారులు, అధికార ప్రతినిధులు అందరూ చేనేత దుస్తులు ధరించాలని సూచనలాంటి వార్నింగ్ ఇచ్చారు. అయితే ప్రత్యేకంగా కలెక్టర్ ఆమ్రపాలిని ఉద్దేశించే.. ఆమె ఆధునిక పోకడలు డ్రెస్సింగ్ విధానాన్ని ఉద్దేశించే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని అంతా అనుకున్నారు.ఈ నేపథ్యంలో ఇవాళ్టి వేడుకలో కలెక్టర్ ఆమ్రపాలి.. వెస్ట్రన్ స్టైల్‌ని వదిలి.. చీరకట్టులో వచ్చినట్లు అందరూ గుసగుసలాడారు. కాగా, ఎప్పుడూ మీడియాతో ఫ్రీగా మాట్లాడే కలెక్టర్ ఆమ్రపాలి..మీడియా ముందుకు రాలేని బెరుకుతనంతో కనిపించారు.













