114 మందితో తెదేపా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం
రమణ, రేవంత్ పదవులు యథాతథం
జాతీయ ఉపాధ్యక్షులుగా సండ్ర, గరికపాటి
తెలుగుదేశం పార్టీ తెలంగాణశాఖ రాష్ట్ర కార్యవర్గాన్ని 114 మందితో ఏర్పాటుచేశారు. తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆమోదం మేరకు కార్యవర్గం జాబితాను విడుదల చేస్తునట్లు పార్టీవర్గాలు శనివారం తెలిపాయి. జాతీయ, కేంద్ర కమిటీల్లో తెలంగాణ నేతలకు సముచిత ప్రాధాన్యమిచ్చారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంపీ గరికపాటి మోహన్‌రావులను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. పొలిట్‌బ్యూరో సభ్యులుగా రావుల చంద్రశేఖరరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, దేవేందర్‌గౌడ్, నామా నాగేశ్వరరావు, ఉమా మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్క నియమితులయ్యారు. ప్రస్తుత రాష్ట్రాధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిలు యథాతథంగా కొనసాగుతారు. 10 మందిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, 9 మందిని ప్రధాన కార్యదర్శులుగా, 11 మంది అధికార ప్రతినిధులుగా, 34 మందిని ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా, 45 మందిని కార్యదర్శులుగా నియమించారు. మీడియా విభాగం కార్యదర్శిగా టి.ప్రకాశ్‌రెడ్డి, పబ్లిసిటీ కార్యదర్శిగా పి.సాయిబాబా, కోశాధికారిగా ప్రేమ్‌కుమార్ జైన్లను నియమించారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు
ఏలేటి అన్నపూర్ణమ్మ, వంగల స్వామిగౌడ్, చాడ సురేష్‌రెడ్డి, లక్ష్మణ్ నాయక్ రామావత్, ఎం.అమర్‌నాథ్‌బాబు, అలీ మస్కతి, భట్టి జగపతి, పాల్వాయి రజనీకుమారి, సామ భూపాల్‌రెడ్డి, ఎం.బి.స్వర్ణకుమారి.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు
అరికెల నర్సారెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, జి.బుచ్చిలింగం, ఈగ మల్లేశం, బి.మల్లయ్య యాదవ్, డి.శ్రీశైలం, అట్లూరి రమాదేవి, లంకల దీపక్‌రెడ్డి, బండ్రు శోభారాణి.
రాష్ట్ర అధికార ప్రతినిధులు
నన్నూరి నర్సిరెడ్డి, రాజారాం యాదవ్, సతీష్ మాదిగ, చిలువేరు కాశీనాథ్, నల్లూరి దుర్గాప్రసాద్, కర్నాటి విద్యాసాగర్, మేడిపల్లి సత్యం, కంచర్ల భూపాల్‌రెడ్డి, కొల్లేటి భవానీశంకర్, అనూషరామ్, కొమ్మినేని సాయివికాస్.








