గవర్నర్‌కు బోనాల జాతర ఆహ్వానం
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ బోనాల జాతరకు హాజరుకావాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు రాజ్‌భవన్‌లో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 9, 10వ తేదీల్లో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు పెద్దఎత్తున భక్తులు తరలివస్తరని వివరించారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్‌పేట కార్పొరేటర్ అతెల్లి అరుణశ్రీనివాస్‌గౌడ్, ఆలయ ఇవో అన్నపూర్ణ, ఆలయ కమిటీ సభ్యులు పద్మశ్రీ, మహేష్‌యాదవ్, సుషీల్కుమార్, వసుంధరమోహన్, మహేష్, రాంమోహన్యాదవ్, జగదీష్ప్రసాద్వర్మ, శ్రీనివాస్‌గౌడ్, ప్రేమ్చౌదరి, ఝాన్సీ, రాజేందర్, పిల్లి శ్రీనివాస్, పౌండర్ ట్రస్టీ సురిటి కృష్ణ, రామతీర్థశర్మ తదితరులు పాల్గొన్నారు.








