సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ జరిగే దేవాలయాలు, చెరువుల దగ్గర అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లును పూర్తి చేశారు.








