హైదరాబాద్లో స్నాప్ ఫిట్నెస్ కేంద్రాలు
అమెరికాకు చెందిన స్నాప్ ఫిట్నెస్ హైదరాబాద్ విపణిలోకి అడుగు పెట్టింది. ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్లో 25 ఫిట్నెస్ కేంద్రాలను (ఆధునిక వ్యాయామ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు స్నాప్ ఫిట్నెస్ భారత మాస్టర్ ఫ్రాంఛైజీ ఫోర్స్ ఫిట్నెస్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీలేఖ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వచ్చే రెండేళ్లలో 35 ఫిట్నెస్ కేంద్రాలను ఫ్రాంఛైజీ విధానంలో ఏర్పాటు చేయనున్నామన్నారు. వచ్చే మూడేళ్లలో దేశీయంగా 300 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దేశీయ ఫిట్నెస్ కేంద్రాల మార్కెట్ విలువ దాదాపు రూ.8,000 కోట్లు ఉంటుందని అంచనా.








