హైకోర్టులో న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
హైకోర్టులో ఆరుగురు న్యాయమూర్తులు నేడు ప్రమాణస్వీకారం చేశారు. వీరిచేత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో జస్టిస్ సోమయాజులు, జస్టిస్ విజయలక్ష్మి, పి.కేశవరావు, జస్టిస్ ఎం.గంగారావు, జస్టిస్ అభినంద్ కుమార్ షామిలి, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ ఉన్నారు. హైకోర్టుకు మొత్తం 61 మంది న్యాయమూర్తుల పోస్టులు మంజూరవగా, ప్రస్తుతం 27 మందే పనిచేస్తున్నారు. తాజాగా ఆరుగురి నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. మరోవైపు జస్టిస్ రాజా ఇళంగో ఈ నెల 22న, మరొక న్యాయమూర్తి వ్చే నెలలో పదవి విరమణ చేయనుండడం గమనార్హం.








