‘అచ్చా.. ఏక్ ప్రామిస్ కరో..
హైదరాబాద్ నగర రోడ్లపై క్రికెట్ లెజెండ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆయన కారు ఆగింది. అదే సమయంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులు తమ పక్కనే కారులో సచిన్‌ను చూసి సెల్ఫీ తీసుకోవడానికి ఎగబడ్డారు. వాళ్ల కోసం కారు విండో డౌన్ చేసి సెల్ఫీ తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు సచిన్. అనంతరం ఓ యువకుడిని ఉద్దేశించి ‘‘అచ్చా.. ఏక్ ప్రామిస్ కరో.. నెక్ట్స్ టైమ్ హెల్మెట్ దాలోకి ఓకే. ఇట్స్ డేంజరస్ ఫర్ యూ’’ అన్నారు. సచిన్ అలా అనడంతో ‘‘యస్ సర్. థ్యాంక్యూ సోమచ్’’ అని ఆ యువకుడు చెప్పాడు. మరో వ్యక్తి ద్విచక్రవాహనం పై నుంచే సచిన్‌కు నమస్కరించగా.. ఆయణ్ని ఉద్దేశించి ‘హెల్మెట్ దాలో భాయ్’ అంటూ ప్రతి నమస్కారం చేశారు.













