ఉపరాష్ట్రపతితో రేవంత్రెడ్డి భేటీ
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్వనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి పదవి చేపట్టినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ చైర్మన్గా సభా గౌరవాన్ని పెంపొందింపజేస్తారని ఆకాంక్షించారు. వెంకయ్యనాయుడు అందరి మన్ననలు పొంది సభకు మరింత గౌరవం తీసుకొస్తారని అన్నారు.








