గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. రాంచందర్రావు!
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduate MLC) బీజేపీ (BJP) అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (N. Ramchander Rao) పేరు ఖరారైనట్లు తెలిసింది. దిల్లీలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశం సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో రాంచందర్రావు అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ అధినాయకత్వం అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు భారతీయ జనతా పార్టీ గత కొద్దిరోజులుగా కసరత్తు ముమ్మరం చేసింది. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే వారి పేర్లను సేకరించింది. ఒక్కో స్థానం నుంచి నలుగురి పేర్లతో అధిష్ఠానానికి ఆశావహుల లిస్ట్ పంపించారు.
ఇవి కూడా చదవండి
పలు అంతర్గత సర్వే రిపోర్టులను సమీక్షించి, రాష్ట్ర నాయకులతో సంప్రదించిన తర్వాత కేంద్ర నాయకత్వం మహబూబ్నగర్( Mahabubnagar)రంగారెడ్డి-హైదరాబాద్ (Hyderabad) స్థానానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావును ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలో ఆయనకు గతంలో ఉన్న అనుభవం కారణంగా అంతర్గత సర్వేలు అనుకూలంగా ఉండడంతో రాష్ట్ర అధ్యక్షుడిని ఇక్కడి నుంచి పోటీలో నిలపాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.







