ఎన్నికలు ముగిశాయి .. ఇక అందరి దృష్టి ప్రజాసేవపైనే : మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. పట్టణ, నగర ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును పెద్ద బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ గెలుపు కూటమి (Alliance) ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) ముగిశాయి. ఇక అందరి దృష్టి ప్రజాసేవపైనే ఉండాలన్నారు. గెలిచిన నేతలంతా ప్రజల (Peoples)కు నిత్యం అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే అసలైన బాధ్యత అని గెలిచిన నేతలకు పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా మరింత అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు.







