ఆదర్శ కుటుంబంతో తమన్‌కు ఎదురుదెబ్బ.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాపై ప్రభావం?
మ్యూజిక్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram)తో మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో పలు సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చాయి. అయితే తాజాగా రిలీజైన ఆదర్శ కుటుంబం(aadarsha kutumbam) సినిమా ఈ కాంబినేషన్‌పై విమర్శలకు కారణమైంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్(thaman) ఎంపిక కావడంపై మొదట ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. చివరకు ఆయన బాధ్యతలు చేపట్టడంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగాయి. కానీ సినిమా రిలీజ్‌కు ముందే వచ్చిన సాంగ్స్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీనిపై విమర్శలు రావడంతో తమన్ రియాక్ట్ అవుతూ, సినిమాలో మరిన్ని సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ను మెప్పిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
అయితే సినిమా రిలీజైన తర్వాత పరిస్థితి మరింత భిన్నంగా కనిపించింది. సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్రివిక్రమ్(Trivikram) గత సినమాలతో పోలిస్తే ఈసారి మ్యూజిక్ విషయంలో నిరాశ ఎదురైందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తమన్‌ను టార్గెట్ గా చేసుకుని ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ పరిణామం ఆయనతో కలిసి వర్క్ చేస్తున్న ఇతర డైరెక్టర్ల ప్రాజెక్టులపైనా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కు దారితీసింది.
మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాకు తమన్‌ను దూరంగా ఉంచాలని కోరుతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న గాడ్ ఆఫ్ వార్ సినిమాకు అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) మ్యూజిక్ అందించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఆదర్శ కుటుంబం రిజల్ట్ తమన్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. గతంలో ఎన్నో సక్సెస్ఫుల్ ఆల్బమ్స్ అందించిన ఆయనకు ఈసారి ఎదురైన విమర్శలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి.







