మాజీ మంత్రి కారుమూరికి ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ రవాణా కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao) కు చుక్కెదురయింది. కారుమూరితో పాటు ఆయన కుమారుడు సునీల్ (Sunil) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు (Nampally Court) కొట్టివేసింది. లిక్కర్ రవాణాలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇద్దరినీ ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. వారిద్దరూ ప్రస్తుతం చంచల్గూడ జైలు (Chanchalguda Jail)లో రిమాండ్లో ఉన్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును ఈడీ అధికారులు విచారించనున్నారు.







