మళ్లీ మొదలైన కుర్రాళ్ల సందడి.. ENE రిపీట్ ట్రైలర్ వచ్చేసింది!
తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించిన ఈ నగరానికి ఏమైంది(ee nagaraniki emaindhi) సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న ENE రిపీట్ మరోసారి ఆసక్తిని పెంచుతోంది. విశ్వక్ సేన్(Viswaksen), అభినవ్ గోమఠం(Abhinav gomatam), వెంకటేష్ కాకుమాను(Venkatesh kakumanu) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు తరుణ్ భాస్కర్(tharun bhaskar) దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజైన ట్రైలర్ యూత్ ను ఎట్రాక్ట్ చేసేలా సరదా సన్నివేశాలు, స్నేహం, భావోద్వేగాలు, సినిమా నేపథ్యంతో సాగింది. గత సినిమాలతోని ఫ్రెండ్స్ మధ్య ఉన్న బాండింగ్ ఈసారి ఎలాంటి మలుపులు తీసుకుంటుందనే ఆసక్తిని ట్రైలర్ కలిగిస్తోంది.
ఈ కథలో కౌషిక్ స్టార్ హీరోగా ఎదగగా, అతడితో సినిమా చేయాలని విశ్వక్ ప్రయత్నిస్తుంటాడు. అయితే కౌషిక్ అంతగా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఫ్రెండ్స్ మధ్య దూరం, అభిప్రాయ భేదాలు తెరపైకి వస్తాయి. చివరకు పాత ఫ్రెండ్స్ అందరూ ఒక్కటై ఓ మంచి కథను రెడీ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో మరోసారి వారి ప్రయాణం మొదలవుతుంది. శివాత్మిక రాజశేఖర్(Sivatmika rajasekhar) సినిమాలపై చూపించే ఆసక్తి, ఆమె తండ్రి రామ్ అభిప్రాయాలు కథలో మరో కోణాన్ని పరిచయం చేస్తున్నాయి. అనీషా అంబ్రోస్(anisha abrose) కూడా తొలి భాగంలోని తన పాత్రలోనే కనిపించనున్నారు. సుశాంత్ ప్లేస్ లో శ్రీనాథ్ మాగంటి(Srinath maganti) ఈ సినిమాలో భాగమయ్యారు.
ట్రైలర్లో తరుణ్ భాస్కర్ తనదైన సహజమైన హాస్యాన్ని, యూత్‌కు కనెక్ట్ అయ్యే సంభాషణలను మరోసారి బలంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా నలుగురు స్నేహితుల మధ్య సాగే సీన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. వివేక్ సాగర్(Vivek sagar) సంగీతం ట్రైలర్‌కు మరింత ఉత్సాహాన్ని అందించింది. సృజన్ యరబోలు(Srujan yarabolu), సందీప్ నాగిరెడ్డి(Sandeep nagireddy) భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌తో పెరిగిన అంచనాలను సినిమా ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.







