ఇట్లు అర్జునకు ఎన్టీఆర్ సపోర్ట్! సినిమాపై పెరుగుతున్న అంచనాలు
కింగ్ నాగార్జున(nagarjuna) సమర్పణలో యంగ్ హీరో అనీష్(aneesh), మలయాళ నటి అనస్వర రాజన్ (anaswara rajan) జంటగా నటిస్తున్న సినిమా ఇట్లు అర్జున(Itlu arjuna). మహేష్ ఉప్పాల(Mahesh uppala) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వెంకీ కుడుముల(venky kuduula) నిర్మిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను రేపు యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో సినిమా ప్రచారానికి మరింత ఊపు వచ్చినట్లయింది.
కొత్త కథలు, యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ముందుండే ఎన్టీఆర్.. ఇప్పుడు ఇట్లు అర్జునకు తనవంతు మద్దతు అందిస్తున్నారు. ఎస్. తమన్(S Thaman) కంపోజ్ చేసిన సాంగ్స్ ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకుంటూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇక తాజాగా రిలీజ్ కానున్న ట్రైలర్లో సినిమా కథాంశం, పాత్రల స్వభావాలు, యాక్షన్ అంశాలకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటివరకు చూడని కథా నేపథ్యం ఈ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుందని సమాచారం.
ఈ సినిమాలో అనీష్ మూగ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇలాంటి ఛాలెంజ్ తో కూడిన పాత్రను ఎంచుకోవడం ద్వారా నటుడిగా తనలోని మరో యాంగిల్ ను చూపించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అనీష్, అనస్వర రాజన్ మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఎన్టీఆర్ ప్రమేయంతో ఇట్లు అర్జునకు మరింత ప్రచారం లభించగా, నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.







