మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో .. మంత్రులంతా ఉత్తీర్ణులైనట్లే
మున్సిపల్ (Municipal), కార్పొరేషన్ ( Corporation) ఎన్నికల్లో మంత్రులంతా ఉత్తీర్ణులైనట్లే అన్న మాట వినిపిస్తోంది. వారి సొంత నియోజకవర్గాల పరిధిలో ఉండే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అన్నీ చోట్లా కూటమి అభ్యర్థులు గెలుపొందడమే కారణం. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీలో ఘన విజయం దక్కింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పిఠాపురం, గొల్లప్రోలులో జనసేన అభ్యర్థులు మున్సిపల్ చైర్ పర్సన్లుగా ఎన్నికయ్యారు.
ఇవి కూడా చదవండి
మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 25 మంది ఉన్నారు. వీరిలో 19 మంది మంత్రులు (Ministers) మున్సిపల్ ఎన్నిలకు ఎదుర్కోవలసి వచ్చింది. మొత్తం మంత్రులంతా పరిషత్ ఎన్నికలను వారి వారి నియోజకవర్గాల్లో ఎదుర్కోవలసి ఉంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరు మునిసపాలిటీ ఫలితం అర్థరాత్రి వరకూ వెలువడింది.ఇక్కడ జనసేన అభ్యర్థి విజయం సాధించడంతో మంత్రులంతా ఈ ఎన్నికల్లో ఉత్తీర్ణులైనట్లే.







