కాలిఫోర్నియాలోని 17 వ జిల్లా నియోజక వర్గం నుంచి రో ఖన్నా విజయం
సిలికాన్ వ్యాలీలోని ఫ్రీమాంట్‌లో నివసిస్తూ, తెలుగువారికి సుపరిచితుడైన రో ఖన్నా, అమెరికా ప్రతినిధుల సభ (House of Representatives) ఎన్నికల్లో తన ప్రత్యర్థి రిపబ్లికన్ అభ్యర్థి రితేష్ టండన్‌పై విజయం సాధించారు.
1976లో ఫిలడెల్ఫియా లో భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన రో ఖన్నా, 2017 నుంచి వరుసగా ఎన్నికల్లో గెలిచి అనేక కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లభించిన విజయంతో ఆయన ఆరోసారి కాలిఫోర్నియా పదిహేడవ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో లెక్చరర్ గా, ఆ తరువాత అడ్వకేట్‌గా పని చేసిన విద్యావంతుడు రో ఖన్నా ప్రెసిడెంట్ ఒబామా ప్రభుత్వంలో వాణిజ్య శాఖలో డిప్యూటీ అసిస్టెంట్ గా కూడా పనిచేశారు.
ఇవి కూడా చదవండి
మొదటి నుంచి కూడా రో ఖన్నా అమెరికాలో తయారు చేసే పరిశ్రమలు, టెక్నాలజీ పరంగా ఉద్యోగాల్ని ఏర్పరిచే విధానం, అందరికీ అందుబాటులో వైద్యం, యుద్ధాల కంటే దౌత్యంగా సమస్యలు సాధించాలనుకునే విధానం లాంటి పాలసీలు, విధానాలపై తన అభిప్రాయాలు తెలుపుతూ కమ్యూనిటీకి దగ్గరయ్యారు.
రో ఖన్నాకు తెలుగు టైమ్స్ అభినందనలు.







