శంకర నేత్రాలయ, డెన్వర్ : కంటిచూపు కోసం సంగీతం, నృత్యం…
శంకర నేత్రాలయ యూఎస్ఏ వారి కొలరాడో చాప్టర్, తమ మొట్ట మోదటి ‘‘మ్యూజిక్ డాన్స్ ఫర్ విజన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించింది. అరోరా, కొలరాడోలోని హింక్లీ హైస్కూల్ భారతీయ సంస్కృతి రంగులు, లయలు, సంప్రదాయాలతో కళకళలాడింది. అంధత్వాన్ని నిర్మూలించడం, తమ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్, అడాప్ట్ ఎ విలేజ్ కార్యక్రమాల ద్వారా వెనుకబడిన వర్గాలకు దృష్టిని తీసుకురావాలన్న శంకర నేత్రాలయ యూఎస్ఏ లక్ష్యానికి మద్దతుగా, ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత నృత్య అకాడమీలు, నిష్ణాతులైన సంగీతకారులు, సమాజ నేతలు, స్వచ్ఛంద కార్యకర్తలు, అనేక కుటుంబాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యాయి.
ఈ కార్యక్రమం మొదట గణేష వందనంతో ప్రారంభమైంది. తర్వాత కొలరాడో చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ మారుతి నాగరాజు ఆత్మీయ స్వాగత వచనాలు పలికారు. శంకర నేత్రాలయ యూఎస్ఏ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సంస్కృతి, సమాజం శక్తిని వారు నొక్కి చెప్పారు. డెన్వర్ లోని కొన్ని ప్రముఖ నృత్య, సంగీత సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తూ, అనుగ్రహ అకాడమీ ఆఫ్ డాన్స్, నందనం లయ డాన్స్ అకాడమీ, నృత్యంగన ఒడిస్సీ డాన్స్ అకాడమీ, కైరాలి స్కూల్ ఆఫ్ డాన్స్, టీమ్ తాల్, శివోహం స్కూల్ ఆఫ్ డాన్స్, మరియు మైల్ హై మేళం వంటి సంస్థలు ఆకట్టుకునే శాస్త్రీయ ప్రదర్శనలను అందించాయి. వీటిలో మైల్ హై మేళం వారి మేళం ప్రదర్శన ప్రత్యేక హైలెట్ గా నిలిచింది. ఇది కేరళ సంప్రదాయ తాళవాద్య కళారూపం శక్తిని, వైభవాన్ని ప్రదర్శించి, తన గతిశీల లయలు, ఉత్సాహభరితమైన శక్తితో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శనకారులందర్నీ, వారి గురువులను ఘనంగా సత్కరించారు.
ఇక.. శంకర నేత్రాయల యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన ఎనిమిదేళ్ల నాయకత్వంలో సంస్థ సాధించిన అద్భుతమైన ప్రగతిని వివరించారు. సంస్థ ఏడు నగరాల నుంచి ముప్పై నగరాలకు విస్తరించిందని, అలాగే మోబైల్ ఐ సర్జికల్ యూనిట్ కార్యక్రమం కింద రెండు సర్జికల్ యూనిట్ల సంఖ్య ఐదుకి పెరిగిందని తెలిపారు. అలాగే మరో మూడు యూనిట్లు సిద్ధమువుతున్నాయని వెల్లడించారు. దీని ద్వారా ఎంతో మంది నిరుపేదలకు తిరిగి కంటి చూపు లభించిందని తెలిపారు.
ఇక.. ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి, శ్యామరెడ్డి దంపతులు, తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం MESU కార్యక్రమం ద్వారా రెండు గ్రామాలను దత్తత తీసుకునేందుకు 25 వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. ఈ నిధులతో 2027 లో నెల్లూరు జిల్లాలో కంటి వైద్య శిబిరాలను నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు, ఇతర కీలక కంటి సంరక్షణ సేవలను అందించనున్నారు.

ప్రముఖ గాయకులు రాము మహారాజపురం, అంజనా సౌమ్యల మనోహరమైన ప్రదర్శనలతో సాంస్కృతిక ఉత్సవాలు మరింత హైలెట్ గా నిలిచాయి. వారి మధుర గానం, కళా నైపుణ్యం, ఆకట్టుకునే వేదికపై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ‘‘మ్యూజిక్ డాన్స్ ఫర్ విజన్ 2026, విజయం, కొలరాడో చాప్టర్ వాలంటీర్ బృందం అచంచలమైన అంకిత బావ, కృషి వల్ల ఇది సాధ్యమైంది. ఈ బృందంలో డాక్టర్ జయసింహ సుంకు, చాము అడప, రవిగడ్డం, క్రాంతి గడ్డం, లయ పాలుట్ల, రఘు పాలుట్ల, మైథిలి నంద్యాల, సుధా మెహతా, నీతూ శర్మ, సతీష్ కంచుకూరి, సుష్మాసింగ్, ఐశ్వర్య రెడ్డి, హేమ బంటు వున్నారు. వారి బృంద స్ఫూర్తి, నిబద్ధత, ప్రతి చిన్న విషయంపై శ్రద్ధతో వారు రెజిస్ట్రేషన్లను సమన్వయం చేసి, సక్సెస్ చేశారు. అలాగే వేదిక, ప్రదర్శన ఏర్పాట్లు కూడా చేశారు. ఆతిథ్యం, అల్పాహారాలను కూడా ఏర్పాటు చేశారు.
అలాగే సాంకేతికత, ఆడియో విజువల్ సహాయం అందించినందుకు వివియన్ నో మరియు లయ పాలుట్లకు, వేదిక అలంకరణ చేసినందుకు డివైన్ డెకార్ బై అఖిలకు, డిన్నర్ బాక్సులు అందించినందుకు చాట్ అండ్ కర్రీకి, ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీ అందించినందుకు MMK ఫోటోగ్రఫీకి, వారి అద్భుతమైన మద్దతు, సహకారం అందించిన హింక్లీ ఉన్నత పాఠశాల సిబ్బంది, యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమం ఆడియో వీడియో విజువల్ అంశాలను రూపొందించడంలో, ప్రచారం చేయడంలో వారి ప్రత్యేక సాంకేతిక నైపుణ్యం కోసం మూర్తి రేకపల్లి, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, శ్యామ్ అప్పాలి, వంశీకృష్ణ ఏరువరం, రత్నకుమార్ కవుటూరు, నీలిమ గడ్డమనుగు, గోవర్ధన్ రావు నిడిగంటి, కార్తికేయ, దీనదయాళన్ కు ధన్యవాదాలు తెలిపారు. మరింత సమాచారం కోసం, విరాళాలు అందించడానికి www. sankaranethralayausa.org వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. లేదా (855) 463-8472 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయవచ్చు. పన్ను మినహాయింపు పొందే విరాళాలను ఈ చిరునామాకు పంపొచ్చు.
Sankara Nethralaya USA, muncaster mill rd, no522, derwood, MD20855







