వైభవంగా బే ఏరియా తెలుగు అసోసియేషన్ దీపావళి సంబరాలు
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా “దీపావళి” సంబరాలను నిర్వహించారు. బాటా నిర్వహించే ప్రధానమైన మరియు అత్యంత ప్రజాదరణ పొందిన ఈ వేడుకకు బే ఏరియా తెలుగు సమాజం నుండి విశేష స్పందన లభించింది. కాలిఫోర్నియాలోని శాన్ రామోస్ నగరం ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది. మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలు రాత్రి 10:00 గంటల వరకు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ప్రముఖ టాలీవుడ్ గాయని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సమీరా భరద్వాజ్ లైవ్ కచేరీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్ గా సంజీవ్ గుప్తా సిపిఎ, పవర్డ్ బై: రియల్టర్ నాగరాజ్ అన్నయ్య వ్యవహరించారు. ప్లాటినం స్పాన్సర్: పి ఎన్ జి జ్యువెలర్స్, గోల్డ్ స్పాన్సర్ గా శ్రీని గోలి రియల్ ఎస్టేట్స్, సిల్వర్ స్పాన్సర్లుగా మైపర్స్యూ, ఇన్స్టా సర్వీస్, అపెక్స్ కన్సల్టింగ్, కావ్యా ఫుడ్స్, లైఫాలజీ మరియు ‘పాఠశాల’ (తెలుగు బడి) వ్యవహరించాయి. టికెటింగ్ పార్టనర్: XPat, ప్రమోటింగ్ పార్టనర్: విరిజల్లు రేడియో, అమోఘం ఇండియన్ కుజైన్ వారు ఫుడ్ స్పాన్సర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దుస్తులు, ఆభరణాలు, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్, విద్య మరియు ఆరోగ్య సంరక్షణ విభాగాలకు చెందిన పలు రకాల వ్యాపార సంస్థలు తమ బూత్ లను ఏర్పాటు చేశాయి.
కార్యక్రమ ముఖ్యాంశాలు:
బాటా సాంస్కృతిక బృందం ఫ్రీమాంట్, సన్ రామోన్, డబ్లిన్, మిల్పిటాస్ మరియు శాన్ జోస్ వంటి పలు ప్రాంతాల్లో శిక్షణా తరగతులు నిర్వహించింది. 100 మందికి పైగా పిల్లలు మరియు యువత ఉత్సాహపూరితమైన నృత్య రూపకాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారందరికీ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.
‘6 ఎలిమెంట్స’ అనే లోకల్ బ్యాండ్ తాజా సూపర్ హిట్ పాటలతో అలరించింది.
సాయంత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచిన సమీరా భరద్వాజ్ మరియు ఆమె బృందం హిట్ పాటలు, తమ మార్క్ కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ ప్రదర్శనను ఎంతో ఆస్వాదించారు. ఈ సందర్భంగా బాటా కమిటీ సభ్యులు సమీరాను శాలువాతో సత్కరించారు.

కమిటీ వివరాలు: కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అహరహం శ్రమించిన అందరికీ అధ్యక్షుడు శివ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన బాటా కార్యవర్గ కమిటీని పరిచయం చేశారు:
కార్యవర్గ కమిటీ: వరుణ్, హరి, సందీప్, సంకేత్
స్టీరింగ్ కమిటీ: రవి తిరువీధుల, కామేష్ మల్లా, యశ్వంత్ కుదరవల్లి
సాంస్కృతిక కమిటీ: శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగెటి, శిరీష బట్టుల, తారక దీప్తి, కిరణ్ వి.
లాజిస్టిక్స్ టీమ్: సురేష్ శివపురం, రవి పోచిరాజు, హరీష్ ఇనాంపూడి, సుధాకర్
యూత్ కమిటీ: ఉదయ్, గౌతమి, సింధు
ఆర్ట్స్ & డిజైన్ కమిటీ: కళ్యాణి, దీప్తి, కృష్ణప్రియ, స్రవంతి
కార్యక్రమం ఘనవిజయం సాధించినందుకు బాటా అడ్వైజరీ బోర్డు సభ్యులైన జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగెటి, రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరి మరియు హరినాథ్ చికోటి బృందాన్ని అభినందించారు.







