ఉమ్మడి ఏపీ శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్ ఎ.చక్రపాణి (Chakrapani) కన్నుమూశారు. హైదరాబాద్ (Hyderabad) లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శాసనమండలి చైర్మన్ (Chairman)గా, సభా వ్యవహారాల నిర్వహణలో పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణలో ఆయన కీలక పాత్ర పోషించారు. శాసన వ్యవస్థలో విశేష అనుభవం కలిగిన నేతగా గుర్తింపు పొందారు. చక్రపాణి మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలిని పునరుద్ధరించిన తర్వాత తొలి చైర్మన్గా డాక్టర్ చక్రపాణి ఎంతో నిబద్ధతతో పనిచేశారని గుర్తుచేసుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో అంకితభావంతో ఆయన ఎన్నో సేవలందించారని కొనియాడారు.







