అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల్లో బ్లూవేవ్..కాన్సస్ డెమొక్రాట్ల వశం..!
KANSAS:
రిపబ్లికన్ల కంచుకోటలు బద్దలయ్యాయి. కాన్సస్ సహా పలుచోట్ల డెమొక్రాట్లు దూసుకెళ్తున్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ అభ్యర్థులకు వరుస షాక్ లు తగులుతున్నాయి. ట్రంప్ పాలనకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు.. తమ ఆగ్రహాన్ని రిపబ్లికన్ పార్టీపై గట్టిగానే చూపారు.ఇప్పటికే సెనెట్‌లో ఆధిపత్యం సాధించగా.. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు మెజార్టీ మార్క్ (218) దాటేశారు. ఇక కాన్సస్‌లో రిపబ్లికన్ల కంచుకోట కూలింది. 94 ఏళ్ల తర్వాత కాన్సస్ రాష్ట్రంలో సెనెట్ స్థానం డెమోక్రాట్ల వశమైంది (Kansas Senate).
కాన్సస్ (Kansas)లో దశాబ్దాలుగా కొనసాగుతోన్న రిపబ్లికన్ల ఆధిపత్యానికి డెమోక్రాట్ అభ్యర్థి ఆడమ్ హమిల్టన్ తెరదించి చరిత్ర సృష్టించారు. సిట్టింగ్ రిపబ్లికన్ అభ్యర్థి రోజర్ మార్షల్‌పై ఆయన సంచలన విజయం సాధించారు. 1939 తర్వాత డెమోక్రటిక్ పార్టీ తరఫున సెనెటర్‌గా గెలిచిన మొదటి వ్యక్తిగా నిలిచారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.(Washington, D.C.) కొత్త మేయర్‌గా డెమోక్రటిక్ పార్టీకి చెందిన జనీస్ లూయిస్ జార్జ్ ఎన్నికయ్యారు. జనవరి 2న మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
వాషింగ్టన్‌ను కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్లనివ్వబోం.. అంటూ ట్రంప్ ఎన్నికల ప్రచారం సమయంలో చెప్పినా ప్రయోజనం లేకపోయింది. రాజధాని నగరం డెమోక్రాట్ల చేతిలోకి వెళ్లకుండా నిలువరించలేకపోయారు. న్యూయార్క్ మేయర్ మమ్దానీ ప్రవేశపెట్టిన ఉచిత ప్రజారవాణా, అందరికీ అందుబాటులో ఉండేలా గృహవసతి వంటి విధానాలను వాషింగ్టన్లో కూడా తీసుకువస్తామని జనీస్ (Janeese Lewis George) ప్రచారం చేసి, విజయం సాధించారు.







