శ్రీవారి మెట్టు మార్గంలో ఎన్ఆర్ఐ మృతి
తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళుతున్న ఓ ఎన్ఆర్ఐ (NRI) భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. అమెరికాలోని బోర్డెన్ టౌన్లో నివసిస్తున్న సింగిరెడ్డి సుర్జిత్రెడ్డి (Singireddy Surjit Reddy)(53) కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల (Tirumala)కు బయల్దేరారు. చంద్రగిరి మండలంలోని శ్రీవారిమెట్టు మార్గంలో నడిచి వెళుతుండగా 800వ మెట్టు వద్ద గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. టీటీడీ (TTD) సెక్యూరిటీ సిబ్బంది ఆయన మృతదేహాన్ని శ్రీవారి మెట్టు కింద భాగంలోకి తీసుకొచ్చి తిరుపతి రుయా ఆస్పత్రి (Ruia Hospital)కి తరలించారు.







