సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఫోన్ చేశారు. రాష్ట్రంలో అర్నబ్, మురుసు తుపాన్లతో కలిగిన నష్టంపై ఆయన ఆరా తీశారు. వారం వ్యవధిలో రెండు తుపాన్ల తాకిడి, ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తుపాన్లతో కలిగిన నష్టాన్ని ప్రధానికి చంద్రబాబు వివరించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో రైతుల (Farmers)కు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. రోడ్లు (Roads), విద్యుత్ (Electricity) సరఫరా సహా వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పారు. రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తుపాను సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేసిందని మోదీ అన్నారు. అప్రమత్తతతో ఇబ్బందులను సమర్థంగా అధిగమించారని చంద్రబాబును మోదీ ప్రశంసించారు.







