న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం పోటీపడ్డ సరితా కోమటిరెడ్డి ఓటమి
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం పోటీపడిన తెలుగు సంతతికి చెందిన మహిళ సరితా కోమటిరెడ్డి ఓటమి చెందారు. ట్రంప్ మద్దతుతో అటార్నీ జనరల్ పదవి కోసం పోటీపడ్డారు. ఆమెపై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి లెటిటియా జేమ్స్ గెలుపొందారు. అయితే.. ఈ ఓటమిపై సరితా రెడ్డి స్పందించారు.
తన ఓటమిని అంగీకరిస్తున్నానని ప్రకటించారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేశానని, వ్యక్తిగత లాభం కోసం కాదన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా.. ప్రజా సేవలోనే వుంటానని హామీ ఇచ్చారు.
మా ప్రచారాన్ని, సురక్షితమైన మరియు బలమైన న్యూయార్క్ కోసం మాకున్న దార్శనికతను విశ్వసించిన వేలాది మంది వాలంటీర్లకు, మద్దతుదారులకు మరియు సాధారణ న్యూయార్క్ వాసులకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేము నిర్వహించిన ప్రచారం పట్ల నేను గర్వపడుతున్నాను,” అని కోమటిరెడ్డి X అనే వెబ్సైట్లో ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.కోమటిరెడ్డి మాట్లాడుతూ, తన ప్రచారం రాజకీయాలు అంటే విభజన, ద్వేషం మాత్రమే కానవసరం లేదని, అవి ప్రజలను ఏకం చేయగలవని నిరూపించిందని పేర్కొన్నారు.
మరోవైపు సరిత కోమటిరెడ్డి న్యాయవాద వృత్తిలో విశేష అనుభవంగలవారు. కొన్ని దశాబ్దాల క్రితమే తెలంగాణ నుంచి వారి కుటుంబం అమెరికాకి వలస వెళ్లింది. బ్రూక్లిన్ లో జన్మించిన సరిత.. తర్వాత మిస్సోరికి షిఫ్ట్ అయ్యారు. కొలంబియా లా స్కూల్ లో లెక్చరర్ గా పనిచేసిన తర్వాత.. ఫెడరల్ ప్రాసిక్యూషన్ లోకి వచ్చారు. డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ స్టాప్ గా కూడా వ్యవహరించారు.







