రాజ్‌భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు
రాఖీపౌర్ణమి సందర్భంగా రాజ్‌భవన్‌లో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం దర్బాల్ హాల్ లో కొలువు దీరిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తోపాటు ఆయన సతీమణి విమలా నరసింహన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మ కుమారీలతో పాటు నగరంలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన బాలికలు గవర్నర్ దంపతులకు రాఖీలు కట్టి వారి ఆశీస్సులు పొందారు. అన్నాచెల్లెళ్ల మధ్య అభిమానం ఆప్యాయతలను సూచించే రాఖీ పండగ ఈ దేశంలో మంచి సాంప్రదాయంగా వస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవనర్ అంధపాఠశాల విద్యార్థులతో పాటు వివిధ పాఠశాల నుంచి వచ్చిన 350 మంది విద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు.








