సీఎం కేసీఆర్ను కలిసిన పీవీ సింధు
స్టార్ షట్లర్ పీవీ సింధు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను సచివాలయంలో కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో రజత పతకం గెలిచిన పీవీ సింధును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. భవిష్యత్తులో భారత్కు మరిన్ని పతకాలు సాధించాలని ముఖ్యమంత్రి వీపీ సింధుకు సూచించారు.








