హైదరాబాద్‌లో రాష్ట్రపతి పర్యటన
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ నెల 17, 18 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మరో నెలన్నరలో పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న ఆయన రెండురోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో బస చేయనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రణబ్ ఎట్ హోం ఆతిథ్యమివ్వనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు, తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు, ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు ప్రముఖుల్ని ఆహ్వానించనున్నారు.








