ప్రపంచ రికార్డు సృష్టించిన ప్రణయ్‌రాజ్
తెలంగాణ రాష్ట్రంలోని యదాద్రి భువనగిరి జిల్లా మోత్కురులోని పద్మశాలీ కాలనీకి చెందిన తెలుగు వికీపీడియా రచయిత వంగరి ప్రణయ్‌రాజ్ తెలుగు వికీపీడియా రచనలో ప్రపంచ రికార్డు సాధించారు. నాలుగేళ్లుగా తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్న ప్రణయ్ వికీవత్సరం అనే శీర్షికతో 365 రోజులు 365 వ్యాసాలు రాసి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియాన్గా చరిత్ర సృష్టించారు. 2016 సెప్టెంబర్ 8న ప్రారంభించి రోజుకు ఒకటి చొప్పున 2017 సెప్టెంబర్ 7 వరకు 365 వ్యాసాలు రాశారు. హైదరాబాద్‌లో జరిగిన వికీపీడియా శిక్షణ శిబిరంలో వికీమీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం అధికారి అసఫ్ బార్టోవ్, తెలుగు వికీపీడీయన్లు ప్రణయ్రాజ్ను అభినందించారు.













