అంతర్జాతీయ ఫిషరీస్ సదస్సుకు పిట్టల రవీందర్
సీనియర్ జర్నలిస్టు పిట్టల రవీందర్‌కు అంతర్జాతీయ ఫిషరీస్ సదస్సుకు ఆహ్వానం అందింది. అమెరికాకు చెందిన కాన్ఫరెన్సు సిరీస్ అనే అంతర్జాతీయ సంస్థ 8వ మత్స్యపరిశ్రమ, జల వ్యవసాయ సమాలోచన పేరిట సదస్సు నిర్వహిస్తోంది. కెనడాలోని టొరంటో నగరంలో అక్టోబర్ 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరగనున్న ఈ సదస్సులో పాల్గొనాలని రవీందర్‌ను కోరుతూ ఆహ్వానం పంపినట్లు తెలంగాణ ఫిషరీష్ సొసైటీ కార్యదర్శి సంపత్ నాగేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.








